Home ఆంధ్రప్రదేశ్ చీరాల కేంద్రంగా జిల్లా కోసం ఊపందుకున్న ఉద్యమం

చీరాల కేంద్రంగా జిల్లా కోసం ఊపందుకున్న ఉద్యమం

473
0

చీరాల : రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఎన్నోఏళ్లుగా అభివృద్ధిలో వివక్షకు గురైన చీరాలను నూతన జిల్లాల ఏర్పాటులోనైనా న్యాయం చేయాలని ప్రజల ఆకాంక్ష ప్రజల్లో చైతన్యం నింపింది. చీరాలను జిల్లా కేంద్రంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తడివాలస దేవరాజ్ కోరారు. బుధవారం ఏఐటీయూసీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం తహసీల్దార్ శేషగిరిరావుకి వినతిపత్రాన్ని అందచేశారు. ముందుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలని జిల్లా కేంద్రం చేయడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. చీరాల పరిసర ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తే పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఉంటుందని సూచించారు. చీరాల కేంద్రం అయితే అందరికి అందుబాటులో ఉంటుందని, ప్రయాణ బడలిక కూడా ఉండదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోసాలా ఆశీర్వాదం, సీపీఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, శామ్యూల్, వైసీపీ ఎస్టీ సెల్ నాయకులు దాసరి శ్రీకాంత్, సీపీఎం నాయకులు పాదర్తి సాయిరాం, దామర్ల శ్రీకృష్ణ, పేరాల జనార్దన్, ఆకురాతి రేవంత్ పాల్గొన్నారు.