Home ప్రకాశం చీరాల ఏఎంసీ చైర్మన్ గా గ్రెగొరీ

చీరాల ఏఎంసీ చైర్మన్ గా గ్రెగొరీ

400
0

చీరాల : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మార్పు గ్రెగొరీ నియమితులయ్యారు. చీరాల రాజకీయాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గ్రెగరీ నియమితులు కావడం పట్ల ఆమంచి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మరి కొంతమంది నాయకులు పోటీ పడినప్పటికీ కృష్ణమోహన్ మాత్రం గ్రెగోరినీ ప్రతిపాదించారు. కృష్ణమోహన్ చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.