Home బాపట్ల రైతు విశిష్ణ సంఖ్య ఉంటేనే సబ్సిడీ పథకాలు

రైతు విశిష్ణ సంఖ్య ఉంటేనే సబ్సిడీ పథకాలు

54
0

చీరాల : మండలంలోని బోయినవారిపాలెం, తోటవారిపాలెం గ్రామాల్లో రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు గురించి మంగళవారం అవగాహన కల్పించారు. మండలంలోని 3118 పీఎం కిసాన్ లబ్ధిదారులకు రైతుల బ్యాంక్ ఖాతాలో రూ.62.36 లక్షలు జమ చేసినట్లు ఎఒ ఐ సుమతి తెలిపారు. రైతు గుర్తింపు సంఖ్య ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విఎఎలు షేక్‌ ఆఫియా, బట్‌షిబ, ప్రసన్న కుమారి పాల్గొన్నారు.