చీరాల : పట్టణంలోని శ్రీనివాసనగర్ కిరానా మర్చంట్ అసోసియేషన్ కల్యాణ మండపంలో బాపట్ల జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆది శైవ అర్చక సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్నా ఆదిశైవ సంగీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్య సీతారామశర్మ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆది శైవ సంఘం జిల్లా నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ ఆదిశైవ అర్చక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సుబ్రమణ్య బాపూజీ, ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ శర్మ, కోశాధికారిగా శ్రీనివాసులచే ప్రమాణ స్వీకారం చేయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరిగాక పోగా, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అబివృద్ది ఒకవైపు, ప్రజా సంక్షేమ పథకాల అమలుఫై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందన్నారు. ఇదే క్రమంలో ఆదిశైవ సంగీయుల అభ్యున్నతికి తామంతా కృషి చేస్తామని అన్నారు. ఆదిశైవ సంగీయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమాలను సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారంచేటి నగేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాధ్యులు స్వర్ణ రవిశంకర్ కుమార్ తదితరలు పర్యవేక్షించారు.