Home గుంటూరు చీరాల జిల్లా ఏర్పాటుకు సహకరించండి : వైవితో దేవరాజు

చీరాల జిల్లా ఏర్పాటుకు సహకరించండి : వైవితో దేవరాజు

565
0

– అమరావతిలో వైవీని కలసి విజప్తి చేసిన జెఎసి కన్వీనర్ దేవరాజ్
– సహకరిస్తానని హామీ ఇచ్చిన సుబ్బారెడ్డి

అమరావతి : చీరాల కేంద్రముగా నూతన జిల్లా ఏర్పాటుకు సహకరించాలని జెఎసి కన్వీనర్ తాడివలస దేవరాజ్ వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కోరారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ దేవరాజ్ రాజధాని అమరావతిలో సుబ్బారెడ్డిని కలిశారు. ఆయనతో జిల్లా విషయమై చర్చించారు. చీరాల ప్రజల ఆకాంక్షలను వివరించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో జిల్లా కేంద్రానికి చీరాల అన్నివిధాలుగా అనువైనదని వైవీకి వివరించారు. అన్నీ ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైలు, బస్సు, రావాణాకు అనువుగా ఉంటుందని చెప్పారు. చేనేత, వస్త్ర వ్యాపారానికి కేంద్రబిందువని వివరించారు. అనువైన తీరప్రాంతం ఇక్కడ అందుబాటులో ఉందన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడ చీరాల విద్య, వైద్య, వినోద్ రంగాలలో ముందుందన్నారు.

స్వాతంత్ర ఫోరాటంలో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు కొత్త జిల్లాకు పెట్టడం అన్ని విధాల న్యాయ మైనదన్నారు. దుగ్గిరాల చీరాలతో పాటు బాపట్ల, రేపల్లె తదితర ప్రాంతాల్లో తిరిగి భ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఛైతన్యం చేశారన్నారు. గతంలో పార్లమెంట్ కేంద్రం విషయంలో కూడ చీరాలకు అన్యాయం జరిగిందన్నారు. ఈసారి వైసీపీ ఫ్రభుత్వం చీరాలకు న్యాయం చేయాలని కోరారు. అన్ని విషయాలను సావధానంగా విన్న సుబ్బారెడ్డి చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెలతానని చెప్పారు.