Home TV News Chinni Serial Today April 26th: చిన్ని సీరియల్: రాజుని రక్తం వచ్చేలా కొట్టిన సత్యం.....

Chinni Serial Today April 26th: చిన్ని సీరియల్: రాజుని రక్తం వచ్చేలా కొట్టిన సత్యం.. కన్నీరు పెట్టుకున్న చిన్ని, కావేరి

119
0

Chinni Serial Today Episode దేవేంద్ర అడ్రస్ కోసం బాలరాజుని అడిగిన సత్యం బాలరాజును కావేరి ఎదురుగానే చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

సత్యంబాబు బైక్ స్టార్ట్ అవ్వక పోవడంతో దేవేంద్ర వర్మ ఆపి తనతో రమ్మని చెప్తాడు. సత్యంబాబు పర్లేదని చెప్పినా మనం ఫ్యామిలీ కదా రండి అని తీసుకెళ్తాడు దేవేంద్రవర్మ. మరోవైపు లాయర్ దేవేంద్ర కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ సరుకులు తీసుకొని వెళ్లడం చూసిన సత్యంబాబు వీడు ఇంటికి వెళ్లిపోతా అని తాళం వేసేసి సరుకులు తీసుకొని వెళ్తున్నాడేంటి అంటే ఆ బాలరాజు ఇంట్లోనే ఉంటాడు అని ఫాలో అవుతాడు.

బాలరాజు, చిన్ని, ఉష అందరూ కలిసి తింటారు. చిన్ని నాన్న నాకు ఒక ముద్ద పెట్టు అంటుంది. తర్వాత కావేరితో తనకు తినిపించమని అంటుంది. చాలా బాగుందని సంతోషంగా చిన్ని తింటుంది. తర్వాత చిన్ని రాజుతో నాన్న అమ్మ గెస్ట్‌గా వచ్చింది కదా అమ్మకి తినిపించు అని అంటుంది. కావేరి చిన్ని మీద కోప్పడుతుంది. నా కోసం అమ్మ ప్లీజ్ నువ్వు నాన్న ఒకరికి ఒకరు తినిపించుకుంటే చూడాలని ఉంది అని అంటుంది. దాంతో కావేరి సరే అంటుంది. కావేరి, రాజు ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. రాజు ఎమోషనల్ అయిపోతాడు. చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నీకి తినిపిస్తారు.

హాఫ్ టికెట్ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తాడు. సత్యంబాబు తనని ఫాలో అయి ఇంటికి రావడం హాఫ్‌ టికెట్ చూసి పరుగున ఇంటిలోపలికి వెళ్లి రాజుతో సత్యంబాబు వస్తున్నాడు అన్న చిన్నిని వదినను ఇక్కడ చూస్తే పెద్ద గొడవ అవుతుందని అంటాడు. దాంతో రాజు ఇద్దరినీ గదిలో పెట్టి లాక్ చేస్తాడు. సత్యంబాబు ఆవేశంగా ఇంటికి వస్తాడు. బాలరాజు కంగారు పడటం చూసిన సత్యంబాబు అనుమానంగా చూస్తాడు. నాకు అర్జెంటుగా ఆ దుర్మార్గుడి అడ్రస్ కావాలని అడుగుతాడు. ఇప్పుడు వాడి గురించి వదిలేయ్ వాడి వల్ల ఎవరికీ ప్రమాదం ఉందని ఇలా అడుగుతున్నావ్ అని బాల అడుగుతాడు.

సత్యంబాబు కోపంతో నా చెల్లికి వాడి వల్ల ప్రమాదం ఉందని అంటాడు. తర్వాత కవర్ చేసి నా చెల్లిలా ఉన్న ఉషకి ప్రమాదం అని హోళీ రోజు, మొన్న కోనేటిలో అన్నీ వాడి పనే అని అనిపిస్తుందని అంటాడు. నాకు అతని అడ్రస్ తెలీదని రాజు అంటే సత్యం బాబు రాజుని చితక్కొడతాడు. నువ్వు వాడు తోడు దొంగలు. వాడి గురించి నీకు తెలీకపోవడం ఏంటి అని చితక్కొట్టి బట్టలు చింపేసి మరి కొడతాడు. తండ్రిని మామ రక్తం వచ్చేలా కొట్టడం చూసిన చిన్ని ఏడుస్తుంది. నాన్న అని వెళ్లబోతే కావేరి ఆపుతుంది. ఇక ఆఫ్‌ టికెట్ సత్యంబాబు కాళ్లు పట్టుకొని అన్నని కొట్టొద్దని బతిమాలుతాడు.

రాజు సత్యంతో కొట్టినా చంపినా నమ్మినా నమ్మకపోయినా నాకు వాడి అడ్రస్ నిజంగా తెలీదని చెప్తాడు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ ఇంత కొట్టినా నువ్వు చెప్పడం లేదు. నేను వాడి అడ్రస్ తెలుసుకుంటానని, వాడిని నిన్ను జైలుకి పంపిస్తా కుదరకపోతే వాడిని చంపి నేను జైలుకి వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. తండ్రి గాయాలు చూసి చిన్ని తండ్రిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మామయ్య అడిగిన అడ్రస్ చెప్పేయొచ్చు కదా అని చిన్ని అంటే రాజు నవ్వుతాడు. అది చూసిన ఉష అడ్రస్ చెప్పేయొచ్చు కదా అంటుంది. దానికి రాజు గంగి గోవు లాంటి మనుషులకు మృగాల అడ్రస్ తెలీకూడదని అంటాడు. ఇక కావేరి, చిన్నిలు రాజుకి ఫస్ట్‌ ఎయిడ్ చేస్తారు. చిన్ని ఆఫ్‌ టికెట్ మందులు తీసుకురావడానికి వెళ్తారు. రాజు కావేరితో మీ అన్నయ్య అడుగుతుంది దేవా అడ్రస్. ఆ అడ్రస్ చెప్తే వాడితో మీ అన్న గొడవ పడతాడు. వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా కుటుంబంలో ఒక్కరినీ వదలడు. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటున్నా ఆలోచించు అని అంటాడు. సత్యంబాబు లాయర్‌ని కలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.