Chinni Serial Today April 24th Episode నాగవల్లి దేవాతో మన మహి భర్త్‌డే ఆ కావేరి అలియాస్ ఉషకి డెర్త్‌డే అవ్వాలని ఈ సారి మన ప్లాన్ మిస్ అవ్వకూడదని అంటుంది. దానికి దేవా ప్లాన్ ఏ ప్లాన్ బీ రెండు రెడీగా ఉన్నాయి. ప్లాన్ ఏ ప్రకారం తను మన చేతికి మట్టి అంటకుండా పైకి పోతుంది. ప్లాన్ బీ ప్రకారం తను ఉష కాదు కావేరి అని అందరికీ తెలిసిపోతుంది. ఈ రెండు ప్లాన్స్‌లో ఏ ప్లాన్ వర్కౌట్ అయిన మన పగ చల్లారుతుందని దేవా చెప్తాడు.
రాజు కన్నీరు పెట్టుకొని కావేరి కాళ్లు పట్టుకొని నన్ను క్షమించు కావేరి అంటాడు.
కావేరి క్షమించాలా నిన్ను… నేను క్షమించాలా… ఎందుకు క్షమించాలా… నా ఆస్తి కోసం నన్ను ప్రేమించినట్లు నటించినందుకు క్షమించాలా…. నన్ను పెళ్లి చేసుకొని మా నాన్న చావుకి కారణమైనందుకు క్షమించాలా… తల్లిదండ్రులుగా చూసుకునే మా అన్నయ్య వదినలకు నన్నుదూరం చేసినందుకు క్షమించాలా… ఆ దేవా గాడు చేసిన నేరం నేను చేశానని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు క్షమించాలా… గర్భవతి అయిన భార్యని జైలుకి పంపినందుకు క్షమించాలా… పురిటికి పుట్టింటికి వెళ్లలేని దౌర్భాగ్యురాలిని చేసినందుకు క్షమించాలా… తండ్రి ప్రేమ తెలీకుండా పెరిగిన నా కూతురి కోసం క్షమించాలా… తప్పు చేస్తే క్షమించొచ్చు కానీ నువ్వు చేసింది క్షమించరాని ద్రోహం.
రాజు : నిజమే కావేరి నేను చేసింది ద్రోహమే కానీ చిన్ని నా కళ్లు తెరిపించింది. నువ్వు నా వల్ల ఎంత నరకం అనుభవించిందో చెప్పింది. అందుకే ఆ నరకం నుంచి నిన్ను కాపాడాలి అనుకున్నా. అలాగే చిన్నితో పాటు నిన్ను కలవడానికి జైలుకి వచ్చినప్పుడు అక్కడ నీ మీద హత్యాప్రయత్నం జరగబోతుందని తెలిసింది. నేను నిర్దోషిగా తీసుకొచ్చినా వాళ్లు నిన్ను బతకనివ్వరని తెలిసి నువ్వు చనిపోయినట్లు అందరినీ నమ్మించి ఉషగా నిన్ను చిన్నికి దగ్గర చేశా.
కావేరి : ఆ రోజు నన్ను కాపాడినందుకు ఈ రోజు వరకు కాపాడుతూ వస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా కానీ నిన్ను ఈ జన్మలో క్షమించలేను. నువ్వు నా మనసుకి చేసిన గాయం రోజు రోజుకి పెరిగి నా మనసు అంతా అయిపోయింది. నిజానికి నాకు నీతో ఇలా మాట్లాడటం కూడా ఇష్టం లేదు. చిన్నిని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చాను.
రాజు : చిన్ని కోసం నన్ను కలవడానికి వచ్చావ్ కదా ఇప్పుడు చిన్ని కోసం నువ్వు చిన్ని నాతో వచ్చేయండి. ఇది కూడా చిన్ని కోసమే. మన ముగ్గురం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి ఎక్కడికైనా వెళ్లి బతుకుదాం.
కావేరి : ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్.
బాలరాజు : దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. దేవాకి ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు కావేరి అని తెలిసి పోతుంది. చిన్ని మన కూతురు అని తెలిస్తే చిన్ని ప్రాణాలకు ప్రమాదం. మీ అన్నయ్య సత్యంబాబు అని తెలిస్తే తన ఫ్యామిలీకి ప్రమాదం. ఇంత మందికి ఏం కాకూడదు అంటే ఉషగా వచ్చిన నువ్వు ఉషగా ఈ ఊరు నుంచి వెళ్లిపోవాలి. అందుకే మన ముగ్గురం ఇక్కడి నుంచి ఎటైనా వెళ్లిపోదాం. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా చిన్ని కోసం మాత్రమే మనం వెళ్లిపోదాం అంటున్నా. జీవితాంతం నువ్వు నన్ను క్షమించకపోయినా పర్లేదు కానీ జీవితాంతం చిన్ని సంతోషంగా ఉండాలి కదా నువ్వే ఆలోచించు.
కావేరి : నీ మాటల్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కాకపోతే చిన్న కోసం అంటున్నావ్ కాబట్టి ఆలోచించి నా నిర్ణయం చెప్తా.
ఇద్దరూ చిన్ని దగ్గరకు వెళ్తారు. చిన్ని తండ్రితో నాన్న గురించి పాజిటివ్‌గా ఆలోచించు అమ్మ అని చెప్తుంది. ఇక కావేరి స్కూటీ స్టార్ట్ అవ్వకపోతే రాజు ట్రై చేస్తాడు. స్కూటీ అవ్వడం లేదని ఆటోలో వెళ్దామని అంటాడు. చిన్ని ఒప్పించి కావేరిని ఆటో ఎక్కిస్తుంది. రాజు చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక చిన్ని వెళ్తూ మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్దామని అంటుంది. ఇక రాజుతో ఆటో మీ ఇంటికి పోనీ నాన్న అంటుంది. కావేరి వాళ్ల ఇంటికి ఎందుకు అని అంటుంది. తను నాన్న అని తెలియక ముందు నా ఫ్రెండ్ అని అంటుంది. కావేరి సరే అంటుంది. దాంతో ముగ్గురు రాజు ఇంటికి వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.