Home TV News Chinni Today Episode : చిన్ని సీరియల్ : దేవేంద్రనను కనిపెట్టే పనిలో సత్యంబాబు.. ఉషనే...

Chinni Today Episode : చిన్ని సీరియల్ : దేవేంద్రనను కనిపెట్టే పనిలో సత్యంబాబు.. ఉషనే తన మేనత్తని తెలుసుకున్న చందు

100
0

Chinni Today Episode లో చిన్ని చందుతో తన పీటీ ఉషనే తన తల్లి కావేరి అని చెప్పడం, చందు ఉషని అత్తమ్మా అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరిని కోనేటిలో తోసేసిన మహిళ నాగవల్లి డబ్బు ఇస్తుందని వెయిట్ చేస్తుంటుంది. నాగవల్లి (పాత నాగవల్లిని మార్చి కొత్త నాగవల్లిని పెట్టారు) ఆ మహిళలను కొట్టి డబ్బు ఇస్తుంది. ఇక సరళ కూరగాయలు కొంటుంది. అక్కడకి నాగవల్లి వెళ్తుంది. సరళని పలకరిస్తుంది. సరళను మీరు చాలా అందంగా ఉన్నారని నాగవల్లి అంటూ బుట్టలో వేసుకుంటుంది.

సరళని బుట్టలో వేసిన నాగవల్లి
నాగవల్లి సరళతో పీటీ టీచర్‌ గురించి మాట్లాడుతుంది. ఉష చాలా మంచిదని పొగిడేస్తుంది. తను డెహ్రాడూన్ అమ్మాయి అని సరళ అంటుంది. దానికి నాగవల్లి తను అక్కడమ్మాయిలా లేదు. మన రాజమండ్రి అమ్మాయిలా ఉందని నాగవల్లి అంటుంది. దానికి సరళ ‘నాకు అదే అనుమానం వచ్చింది. కానీ తన తల్లిదండ్రుల్ని చూస్తే అర్థమైంది తనని తెలుగు అమ్మాయిలా పెంచారని’ అని చెప్తుంది. ఇక నాగవల్లి వెళ్లిపోతుంది. సరళ నాగవల్లి కారును చూసి అలాంటి కారులో తిరాగాలి అన్నా రాసి పెట్టాలి. మెషెన్ తొక్కుకునే వాళ్లకి కార్లు ఎక్కడ నుంచి వస్తాయని బాధ పడుతుంది.

కావేరినే ఉష అని తెలుసుకున్న లాయర్
సత్యంబాబు చెల్లి కావేరి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ మెషిన్ తొక్కుతాడు. మెషిన్ తన చేతి మీదకు వచ్చే టైంకి లాయర్ వచ్చి సత్యంని ఆపుతాడు. చెల్లి కష్టాలు కళ్ల ముందు కనిపిస్తుంటే బాధేస్తుందని అంటాడు. లాయర్ విషయం అడిగితే సత్యంబాబు కవర్ చేస్తాడు. నువ్వు నా దగ్గర ఏం దాచినా పర్లేదు కానీ కావేరి గురించి నిజం దాయొద్దని అంటాడు. దాంతో సత్యంబాబు ఉష తన చెల్లి కావేరి అని చెప్తాడు. లాయర్ నమ్మలేకపోతున్నాను మీరు చాలా అదృష్టవంతులని అంటాడు. దేవేంద్ర వర్మ అడ్రస్ తెలుసుకోవాలని కావేరిని కాపాడుకోవాలంటే ముందు అది మనకు తెలియాలని సత్యంబాబు అంటాడు.

దేవేంద్రని కనిపెడదాం పద..
దానికి లాయర్ హరి ‘వాడిది మన రాజమండ్రినే అయింటుందని, హైదరాబాద్ బిజినెస్ పని మీద వెళ్లుంటాడని, అందుకే హైదరాబాద్ మొత్తం వెతికినా దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ వెతకాలి అంటాడు. మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్లి పేరుతో ఎంక్వైరీ చేద్దామని అతన్ని నేను చూశా కాబట్టి దేవేంద్రని గుర్తు పడతానని హరి అంటాడు. దాంతో ఇద్దరూ మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్లారు. లాయర్, సత్యంబాబు మున్సిపల్‌ ఆఫీస్‌కి వెళ్లి ఓ ఆఫీసర్‌తో తమకు దేవేంద్ర వర్మలు ఎంత మంది ఉంటే అంత మంది అడ్రస్‌లు కావాలని అడుగుతాడు. ఆఫీసర్ కుదరదు అంటే హరి ఆయనకు లంచం ఇస్తాడు. దాంతో ఆయన అడ్రస్ పంపిస్తానని అంటాడు.

నా ప్రాణం పోయినా పర్లేదు..
దేవేంద్ర వర్మ అంతు చూడాలని సత్యంబాబు అంటే హరి సత్యంబాబుతో వాడికి ఎదురెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే మనం తొందరపడకూడదని అంటాడు. దానికి సత్యంబాబు నా చెల్లి, మేనకోడలు సంతోషంగా ఉండటానికి నా ప్రాణాలు పోయినా పర్లేదని అంటాడు. చెల్లి కోసం ప్రాణాలు తెగించి యుద్ధం చేసే నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నీ చెల్లి చాలా అదృష్టవంతురాలని లాయర్ అంటాడు. దానికి సత్యంబాబు నా చెల్లి పుట్టుకతోనే అదృష్టవంతురాలు. ఎప్పుడైతే ఆ బాలరాజు దరిద్రం పట్టిందో అప్పుడే నా చెల్లి బతుకు ఇలా అయిపోయిందని అంటాడు.

అమ్మ చనిపోలేదు చందు..
చిన్ని గ్రౌండ్‌లో కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ అమ్మ ఎప్పుడు నాన్నని అర్థం చేసుకుంటుందో, నాన్న పూర్తిగా మారిపోయాడు. అమ్మ… నాన్నని అర్థం చేసుకో అమ్మ అని అమ్మానాన్నలు తన చేయి పట్టుకున్నట్లు డ్రాయింగ్ వేస్తూ ఏడుస్తుంది. చందు దూరం నుంచి చూసి చిన్ని ఒంటరిగా ఏం చేస్తుంది అనుకుంటాడు. దగ్గరకు వెళ్లి చూస్తాడు. ఆ డ్రాయింగ్ చూసి… అత్తయ్య గురించి ఎప్పుడూ ఇలా ఆలోచిస్తే ఎలా? అత్తయ్య చనిపోయినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లి ఎంత బాధ పడ్డావో కదా… ఇప్పుడు మళ్లీ ఇలా అయితే ఎలా… అని ఈ బొమ్మ ఉంటే నువ్వు అత్తయ్య కోసం ఆలోచించి బాధ పడతావ్ బొమ్మ చింపేస్తా అని అంటాడు. చిన్ని ఆపుతుంది. అమ్మ చనిపోలేదని చెప్తుంది. చందు షాక్ అవుతాడు. అత్తయ్య చనిపోలేదా అని అడుగుతాడు. చనిపోలేదని చిన్ని చెప్తుంది. మన పీటీ టీచరే మా అమ్మ అని చెప్తుంది. ఇంకా అదే భ్రమలో ఉన్నావా చిన్ని అని చందు అడిగితే భ్రమ కాదు నిజం అని మొత్తం చిన్ని చెప్తుంది.

అత్తమ్మా అని పిలిచిన చందు..
డ్రాయింగ్ చూసి చందు ఏడుస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చందుతో చిన్ని చెప్తుంది. ప్రామిస్ వేయించుకుంటుంది. ఇక ఇద్దరూ కావేరిని చూడటానికి వెళ్తారు. వాళ్లు తనని చూడటం కావేరి గుర్తిస్తుంది. పిల్లల దగ్గరకు వస్తుంది. ఏంట్రా ఇక్కడ.. ఎం చేస్తున్నారు అంటే ఏం లేదు అత్తమ్మ అని చందు అంటే ఉష వరసలు ఏంట్రా అని అడుగుతుంది. మీరు మా నాన్నకి చెల్లి కాని చెల్లి కదా నన్ను మేనల్లుడు కాని మేనల్లుడు అని అన్నారు కదా… అందుకే మీరు నాకు అత్తమ్మ కానీ అత్తమ్మ అంటాడు. దాంతో కావేరి చందు చెవి మెలేసి నవ్వుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.