Chinni Serial April 17th Episode: కుటుంబ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే.. రాజా సినిమాలో క్లైమాక్స్ సీన్లో వెంకటేష్ నటన గుర్తురాకమానదు. ఆ సినిమాలో హీరోయిన్ సౌందర్య.. తన ఎదుగుదలకు కారణం రాజానే అని అందరి ముందు చెప్పే సీన్‌లో వెంకటేష్ నటన నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు చిన్ని సీరియల్‌లో బాలరాజు ఆ సీన్‌ను గుర్తు చేశాడు. నేటి (ఏప్రిల్ 17) రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఏమైందంటే….
https://www.instagram.com/reel/DIh4AYcRYuD/?utm_source=ig_web_copy_link
చిన్నికి స్కూల్‌లో అవార్డ్ వచ్చింది. పేరెంట్స్ కలిసి ఆ అవార్డ్‌ను అందుకోవాలని చిన్ని అనుకుంటుంది. అయితే చిన్నినే తమ కూతురని బయటకు తెలిస్తే.. ప్రమాదమని భావించిన బాలరాజు ఆ నిజాన్ని బయటపెట్టొద్దని అంటాడు. దాంతో చిన్ని.. అమ్మ, నాన్న కళ్ల ముందే ఉన్నా నేనో అనాధలా ఉండాల్సి వస్తుందంటూ కన్నీటి పర్యంతం అవుతుంది. దాంతో ఎప్పుడో వచ్చే సమస్య కంటే.. ఇప్పుడు తనకి తన కూతురు సంతోషమే ముఖ్యం అనుకున్న బాలరాజు.. పదమ్మా.. నీ తండ్రి స్థానంలో నేను ఉంటా.. వెళ్లి అవార్డ్ తీసుకుందామని అంటాడు. ఇది నిన్నటి ఎపిసోడ్‌లో ముచ్చట కాగా.. ఈరోజు ఎపిసోడ్‌లో రాజా సినిమాలో వెంకటేష్ క్లైమాక్స్ సీన్ తరహాలో బాలరాజు, చిన్ని గుండెలు పిండేశారు.
నేటి (ఏప్రిల్ 17) రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ‘చిన్నీ.. నీకు అవార్డ్ వచ్చింది కదా.. అది అందుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదా? అని ప్రిన్సిపాల్ అడుగుతుంది. వచ్చారు టీచర్ అని చిన్ని అంటుంది. ‘మా అమ్మ వచ్చిందని చెప్పేస్తుందా? ఏంటని కంగారుపడుతుంటుంది అక్కడే ఉన్న కావేరి. చెప్పమ్మా మీ ఫ్యామిలీ తరుపున ఎవరొచ్చారు? మీ మామయ్య వచ్చాడా? అని అడుగుతుంది ప్రిన్సిపాల్.
‘అదిగో మా నాన్న’ వచ్చాడని చిన్నీ అనగానే… రాజా సినిమా క్లైమాక్స్‌లో వెంకటేష్‌ని గుర్తు చేశాడే
లేదు టీచర్.. ‘మా నాన్న వచ్చారని అంటుంది చిన్ని. ఆ మాటతో కావేరి షాక్ అయ్యి షేక్ అయిపోతుంది. ప్రిన్సిపాల్ కూడా షాక్‌లో ఉండి పోతుంది. ఇంతలో బాలరాజు ఎంట్రీ ఇస్తాడు. అతని ఎంట్రీ మామూలుగా ఉండదు. ‘నాన్నా’ అని చిన్ని పిలిచేసరికి.. రాజా సినిమాలో వెంకటేష్ మాదిరిగా జనం చప్పట్ల మధ్య నడుచుకుంటూ వచ్చే సీన్ మామూలుగా ఉండదు. ఎమోషన్స్‌తో బాలరాజు పిండేశాడు. కళ్లతోనే జీవించేశాడు. చిన్ని తండ్రి స్థానంలో స్టేజ్ మీదికి వచ్చి చిన్నితో కలిసి అవార్డ్ అందుకునే సీన్ అద్దిరిపోయింది.
గుండెల్ని పిండేశాడు భయ్యా..
పక్కనే ఉన్న కావేరి అలా మౌనంగా ఉండిపోతుంది. బాలరాజు వైపు కోపంగా చూస్తుంది. తల్లిలేని పిల్లకి తల్లితండ్రి మీరే అయ్యి అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి.. మీ అమ్మాయి ఈ పొజిషన్‌లో ఉందని తెగ పొగిడేస్తుంది టీచర్. దాంతో కావేరికి మరింత మండిపోతుంది. మొత్తానికి సీన్ అయితే అద్భుతంగా పండింది. చిన్ని కోరుకున్నట్టుగానే తన పేరెంట్స్ (బాలరాజు, కావేరి)లు పక్క పక్కనే ఉండగానే అవార్డ్ అందుకుంది. ఆ తరువాత చిన్నిని తీసుకుని బయటకు వస్తుండగా.. బాలరాజుకి దేవా కనిపిస్తాడు. దేవా కొడుకు మహికి కూడా అవార్డ్ రావడంతో ఆ అవార్డ్ అందుకోవడానికి దేవా వస్తాడు.
భార్య, కూతురు కోసం వచ్చావా… బాలరాజు ?
దేవాపై కన్నేసిన బాలరాజు.. చిన్నిని అక్కడ నుంచి పంపేసి దేవాకి ఎదురుపడతాడు. ఏంటి బాలరాజు.. ఏంటి స్కూల్‌కి వచ్చావ్ కూతురు కోసమా? అని అంటాడు దేవా. కూతురేంటి? అని బాలరాజు అనడంతో.. ‘కంగారు పడకు.. జోక్ చేశానంతే. నువ్వు ఆల్రెడీ చెప్పావ్ కదా.. కూతురు ఇక్కడ లేదని. హో భార్యని చూడ్డానికి వచ్చావా? కంగారు పడకులే.. అదే భార్య కానీ భార్య ఆ పీటీ టీచర్ కోసం వచ్చావా? ఆ టీచర్ జైలులో చనిపోయినా నీ భార్యలాగే ఉందని అలా అన్నాలే’ అని కావాలనే కెలుకుతాడు దేవా. దాంతో బాలరాజు.. నా భార్య జైలులోనే చనిపోయిందనే విషయం గుర్తుందంటే.. తనని ఎందుకు జైలుకిపంపించానో నీకు గుర్తుండాలి కదా.
నా కూతురికి హాని చేస్తే.. నీ కొడుక్కి కూడా అదే జరుగుద్ది గుర్తుపెట్టుకో
నేను నీ ఫ్రెండ్‌ని అయిన పాపానికి నువ్వు నీ భార్యని చంపినందుకు.. నా భార్య జైలుకి వెళ్లాల్సి వచ్చిందని అంటాడు బాలరాజు. హో నీ భార్య జైలులో చనిపోయిందని.. పీఈటీ టీచర్‌లో నీ భార్యను చూసుకోవడానికి వచ్చావా? అని అంటాడు దేవా. లేదు.. నీ దయ వల్ల అడ్డమైన పనులు మాసేసి.. పిల్లల ఆటో నడుపుకుంటున్నా.. అందుకే స్కూల్‌కి వచ్చా అని అంటాడు బాలరాజు. ఇంతలో డాడీ అంటూ వస్తాడు మహి. నాకూ కూతురు ఉన్నట్టే నీకూ ఓ కొడుకు ఉన్నాడు.. మర్చిపోవద్దు.. నా కూతురికి ఏమైనా అయితే నీ కొడుక్కి కూడా అదే అవ్వుద్ది.. గుర్తుపెట్టుకో అని దేవాకు వార్నింగ్ ఇస్తాడు బాలరాజు.
చావో.. రేవో కాదు.. ఖచ్చితంగా నీ చావే
ఆ తరువాత మహి కూడా చిన్ని మాదిరే తండ్రితో కలిసి అవార్డ్ అందుకుంటాడు. కావేరి కూడా అక్కడ ఉండటం చూసిన దేవా… ‘హలో కావేరీ’ అని కావాలనే పలకరిస్తాడు. ఆ పిలుపు విన్న కావేరి.. ‘ఎన్నిసార్లు చెప్పాలి మీకు.. నేను కావేరిని కాదు.. ఉషని అని.. కావేరి కావేరి అని చనిపోయిన మనిషిని అంతలా కలవరిస్తున్నారూ.. ఏదోరోజు కావేరి తిరిగి వస్తే నువ్వు చస్తావ్ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది కావేరి. ‘చనిపోతానో.. చంపుతానో.. ఎవరికి తెలుసు మేడమ్.. అయినా నేను కూడా అదే కోరుకుంటున్నా.. కావేరి బతికి వస్తేమిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చావో రేవో తేల్చుకుంటాను కదా’ అని అంటాడు దేవా.
ఆఖరిసారి చెప్తున్నా.. వాడు నీ తండ్రి కాదు
చావో రేవో కాదు. ఖచ్చితంగా చావే. చనిపోయిన మనిషి బతికి రావడం అంటే దెయ్యంగా రావడమే కదా. దెయ్యంగా వస్తే నిన్ను చంపుకుని తింటుంది కదా అని కావేరి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అనంతరం చిన్ని దగ్గరకు వెళ్లి తిట్టిపారేస్తుంది. వాడ్ని తీసుకొచ్చి ‘నాన్న’ అని ఎందుకు చెప్పావ్ అని నిలదీస్తుంది. నాన్నగా వాడు ఏం చేశాడే. నాన్నగా ఏనాడైనా నీ పక్కన నిలబడ్డాడా? అని అడుగుతుంది. లేదమ్మా ఇప్పటి వరకూ నిలబడలేదు. కానీ ఈరోజు నా పక్కన నాన్నగా నిలబడ్డాడు కదమ్మా. నాన్న మారిపోయాడమ్మా’ అని చిన్ని అంటుంది. దాంతో కావేరి వాడు మారడం ఏంటే వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. ఆఖరి సారి చెప్తున్నా వాడు నీ తండ్రి అనే ఆలోచన నీ మనసులోకి రాకూడదు.’ అని చిన్నిని కావేరి హెచ్చరిస్తుంది. నాన్న చేసిన చెడే నీకు తెలుసు. కానీ నాన్న చేస్తున్న మంచి ఏంటో నేనే నీకు తెలిసేలా చేస్తాను’ అని మనసులో చిన్ని అనుకుంటుంది.