Home ప్రకాశం పిల్లల సంరక్షణపై బాలింతలు, గర్భిణీ మహిళలకు క్రీడ్స్ సంస్థ అవగాహన

పిల్లల సంరక్షణపై బాలింతలు, గర్భిణీ మహిళలకు క్రీడ్స్ సంస్థ అవగాహన

209
0

చీరాల : క్రీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వాడరేవు అంగన్వాడి సెంటర్ నందు కవిడ్19 గురించి గర్భిణీలకు, బాలింతలకు పిల్లల సంరక్షణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ అధ్యక్షులు దేవరపల్లి డేవిడ్ రాజు మాట్లాడుతూ బాలింతలు తప్పనిసరిగా సబ్బుతో చేతులను శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలకు భోజనం తెరిపించాలన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు బాత్రూంకు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. పిల్లలకి మలవిసర్జన శుభ్రం చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగు కోవాలన్నారు.

వేటపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ వైయస్సార్ కిట్టు ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని అన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరూ పౌష్టిక ఆహారం తీసుకొనుట ద్వారా కోవిడ్ ఎదుర్కోవచ్చన్నారు. అలాగే మాస్కులు శానిటైజర్, సామాజిక దూరం పాటించడంవల్ల కోవిడ్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించు కోవచ్చన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త సత్యవతి, ఆశా వర్కర్స్ మల్లేశ్వరి, బాలింతలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.