Home ఆంధ్రప్రదేశ్ బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా విడుదల

బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా విడుదల

36
0

పర్చూరు : పసుమర్రు, చిలకలూరిపేట మధ్య గత ఏడాది మే నెలలో జరిగిన రోడ్డు (బస్సు)ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా విడుదల చేసింది. బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి లేఖలు అందజేశారు. ఇటీవల చిన్నగంజాం పర్యటనలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే ఏలూరి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధిత కుటుంబాల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరికి సీఎంఓ నుంచి వెల్లడించారు. గత ఏడాది మే నెలలో బస్సు ప్రమాదంలో

చిన్నగంజాం మండలం నీలాయపాలెంకు చెందిన

  1. కాశీ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మి , ఖ్యాతి (శ్రీసాయి), గొనసపూడికి చెందిన దావులూరి శ్రీనివాస్ మృతి చెందారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.2.50 లక్షలు చొప్పున విడుదల చేశారు. వారిలో ముప్పరాజు దుర్గా, పూజ, ముప్పరాజు వెంకట సుబ్బారావు, దొప్పలపూడి భావన, దావులూరి అంజమ్మ లకు ఒక్కొక్కరికి రు.10లక్షలు చొప్పున క్షతగాత్రులు బాడుగు సంజన, గడిపాటి తేజస్విని, దొప్పలపూడి భావనలకు ఒక్కరికి రు.రెండున్నర లక్షలు చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు సీఎం ఆ కుటుంబాల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.