పర్చూరు (Parchuru) : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluru Sambashivarao) సిఫారసు మేరకు అత్యవసర చికిత్స కొరకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన LOC లను కారంచేడు మండలం దగ్గుబాడు గ్రామానికి చెందిన ముళ్ళ మున్నీకి రూ.83,112 విలువైన చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులు గురువారం అందజేశారు. పర్చూరు మండలం అన్నబోట్లవారిపాలెంకు చెందిన బిరుదు రాహేలుకు రూ.49,319 చెక్కును ఎమ్మెల్యే ఆదేశాలతో క్యాంపు కార్యాలయంలో అందజేశారు.






