Home బాపట్ల ప్రవేటు అంబులెన్సుల దోపిడీకి చెక్‌

ప్రవేటు అంబులెన్సుల దోపిడీకి చెక్‌

8
0

బాపట్ల (DN5 News) : ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రజల నుండి ఛార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అంబులెన్స్ రవాణా చార్జీల పోస్టర్ పట్టికను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేసినట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 7702806804 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే డిఎంహెచ్‌ఓ లేదా సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.