చీరాల : పట్టణంలోని శ్రీరంనాగర్ లో రమణ అనే రిక్షా కార్మికుని కుటుంబానికి చంద్రన్న భీమా పథకం ద్వారా రూ.5వేలు తక్షణ ఆర్ధిక సహాయాన్ని వార్డు కౌన్సిలర్ ఈసర్ల సుజాత చొరవతో భీమా మిత్ర శుక్రవారం అందజేశారు. రమణ గుండెనొప్పితో మృతి చెందారు. రమణ భార్య పాపమ్మ చంద్రన్న భీమా సభ్యురాలు కావడంతో విషయం తెలుసుకున్న 25వ వార్డ్ కౌన్సెల్లర్ ఈసర్ల సుజాత చంద్రన్న భీమా మిత్ర దృష్టికి తీసుకెళ్లి తక్షణ సహాయం అందించారు. మిగిలిన రూ.25వేలను నెలరోజుల్లోపు బ్యాంకు కాతాలో జమ చేస్తారని తెలిపారు..కార్యక్రమంలో ఈసర్ల రామారావు ,చంద్రన్న భీమా ప్రతినిధులు చంద్రశేఖర్, శిరీష పాల్గొన్నారు.