Home ఆంధ్రప్రదేశ్ ప్రకాశంలో చంద్రబాబు పర్యటన – బాధితులకు పరామర్శ

ప్రకాశంలో చంద్రబాబు పర్యటన – బాధితులకు పరామర్శ

415
0

ప్రకాశం : సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్చూరు నియోజకవర్గానికి వచ్చారు. పర్చూరు బొమ్మల సెంటర్ లో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారధ్యంలో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అశేష జనసంద్రం మధ్య పర్చూరు బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. అభివృద్ధి ప్రజాల అవసరాలపై కాకుండా టిడిపిని దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే పాలన చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందన్నారు.

కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, ఎం అశోక్ రెడ్డి, డిబిఎన్ స్వామి, కరణం వెంకటేష్, యడం బాలాజీ, నుకసాని బాలాజీ, బిఎన్ విజయ్ కుమార్, పోతుల రామరావు, పోతుల సునీత, ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.