ప్రకాశం : పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రామాంబపురంలో వైసీపీ కార్యకర్తల దాడితో మృతి చెందిన పద్మ కుటుంబాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధినుంది రూ.5లక్షలు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూ.2లక్షలు, సింగపూర్ పార్టీ కార్యకర్తలు ఒక లక్ష, స్థానిక టిడిపి నాయకులు రూ.57వేలు ఆర్థిక సహాయం అందజేశారు.