అమరావతి : ఎన్నికల ఫలితాల్లో 23స్థానాలకు పరిమితమైన టిడిపికి శాసన సభాపక్ష నేత ఎవరవుతారని ఇప్పటివరకు ఊహాగానాలు సాగాయి. టిడిపి శాసన సభాపక్ష సమావేశం అమరావతిలోని ఎన్‌టిఆర్ భవన్‌లో నిర్వహించారు. టిడిపి శాసనసభా పక్ష నేతగా నారా చంద్ర బాబు నాయుడును శాసన సభ్యులు, నాయకులు కరతాళ ధ్వనులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులతోపాటు పార్లమెంటు సభ్యులు, ఇతర నాయకులు హాజరయ్యారు.