అమరావతి : టిడిపి ఒడుదుడుకులకులోనైన ప్రతిసారీ చంద్రబాబునాయడు తన సమర్థతతో పరిస్థితులను చక్కదిద్దారని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడి టిడిపి కార్యాలయంలో జరిగిన చంద్రబాబు 69వ జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. టిడిపి ప్రధాన కార్యదర్శిగా నాడు పార్టీ నియమావళిని, సంస్కృతిని పటిష్టంగా చంద్రబాబు ఆచరింప చేశారన్నారు. గ్రామస్థాయి, మండలస్థాయిలలో పార్టీకి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. నేటికీ ఎన్టీఆర్ ఆశయసాధన కోసం, కోట్లాది తెలుగువారు నమ్ముకున్న తెలుగుదేశం పటిష్టత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
Home ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబుకు కృషి : చంద్రబాబు జన్మదిన వేడుకల్లో జలవనరుల శాఖ మంత్రి...