Home ప్రకాశం బాల్య‌ వివాహాల నిర్మూల‌న‌లో…

బాల్య‌ వివాహాల నిర్మూల‌న‌లో…

429
0

చీరాల : బాల్య వివాహాలు నిర్మూలించుట‌లో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చీరాల తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హెల్ప్ గర్ల్ అడ్వాకసి చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో చీరాల‌ తహసిల్దార్ కార్యలయంలో సోమ‌వారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ వచ్చే రెండూ మూడు నెలలు వివాహాల సీజన్ కాబట్టి ఈ సీజన్‌లో బాల్య వివాహాలు జరగకుండా అధికారులు చూడాల‌ని చెప్పారు. గ్రామ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేయాల‌న్నారు. ప్రజలకు బాల్య వివాహాలు వల్ల కలిగే నష్టలను వివరించి చైతన్య పర్చాలని పేర్కొన్నారు. హెల్ప్ చైల్డ్ లైన్ పిఓ బివి సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఒకరి ఒకరు సమన్వయంతో కలిసి సమిష్టిగా పనిచేసి బాల్య వివాహాల నిర్ములన‌కు కృషి చేయాల‌న్నారు. రాబోయే రోజుల్లో బాల్య వివాహాలు రహిత జిల్లా రూపొందించిలని కోరారు. ఎక్కడైనా నిరాదరణకు గురైన బాల‌లు ఉంటే చైల్డ్ లైన్1098కి సమాచారం ఇవ్వాలని కోరారు.