టంగుటూరు : సూరారెడ్డిపాలెం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అంగీకారం తెలిపినట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైళ్ల రద్దీ బాగా పెరుగుట వలన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు ఆయిల్ గూడ్స్ రైళ్ళ రాకపోకలు కూడా ఉండటం వలన సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న 199వ లెవెల్ క్రాసింగ్ గేటు గంటల తరబడి మూసి వేసి ఉంటుంది. దీంతో ఒంగోలు, టంగుటూరు, పరిసర గ్రామాల వాహనదారులు, ప్రజలు నిత్యం రైల్వేగేటు వద్ద గంటల తరబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరినట్లు తెలిపారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం బాగా ఆలస్యం అవుతుందని, దానికి బదులుగా అండర్ బ్రిడ్జి మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు మాగుంట తెలిపారు.