Home బాపట్ల టిడిపి నేతలపై కేసు కొట్టివేత

టిడిపి నేతలపై కేసు కొట్టివేత

14
0

చీరాల (DN5 News) : కరోనా సమయంలో 2020 మే 28న నిబంధనలు ఉల్లంఘించి ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూల దండలు వేసి కేకు కట్‌ చేశారనే నెపంతో అప్పటి వైసిపి ప్రభుత్వంలో పోలీసులు బనాయించిన కేసు విచారించిన న్యాయమూర్తి శుక్రవారం కొట్టివేశారు. తమపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించారని కేసులో బాధితులు పేర్కొన్నారు. కేసులో ఉన్న అప్పటి టిడిపి పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, మాజీ జెడ్‌పిటిసి గుద్దంటి చంద్రమౌళి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు, టిడిపి వేటపాలెం అధ్యక్షులు కర్ణ శ్రీనివాసరావు, పట్టణంలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్ తుపాకుల రఘునాథ్ బాబు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి, కీర్తిశేషులు కోట సాంబశివరావు, టిడిపి వేటపాలెం మండల మాజీ అధ్యక్షులు పృధ్వి చంద్రమోహన్, టిడిపి బాపట్ల జిల్లా కార్యదర్శి, కీర్తిశేషులు పులి వెంకట్రావు, మాజీ ఎంపిటిసి పృద్వి వెంకటేశ్వర్లు, పట్టణ మాజీ ఉపాధ్యక్షులు బండారు వెంకట సుబ్బారావు, టిడిపి పట్టణ మాజీ కార్యదర్శి గుమ్మ గంగయ్య, టిడిపి సీనియర్‌ నాయకులు మాచర్ల ఆంజనేయులుపై కేసు కొట్టివేశారు.