టంగుటూరు : తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. మర్రిపూడి మండల అయ్యవారిపాలెంకు చెందిన లెక్క అఖిలకు రూ 20వేలు, టంగుటూరు మండలం నిడమానూరుకు చెందిన యతం శ్రీలక్ష్మికి రూ.43వేలు, పిడుగురాళ్ళ గోవిందమ్మకు రు. 17వేలు, పిడుగురాళ్ళ నరసింహంకు రూ.17వేలు, వల్లూరుకు చెందిన అంబోరు వెంకట శేషయ్యకు రు.30వేలు, షేక్ షకీలా రూ.40వేలు, సింగరాయకొండకు చెందిన కాకి ఎసురత్నంకు రు. 5వేల విలువైన ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పంపిణి చేశారు.