Home క్రైమ్ కారు టైరు పగిలి బోల్తా : ఒకరి మృతి, ఇరువురికి గాయాలు

కారు టైరు పగిలి బోల్తా : ఒకరి మృతి, ఇరువురికి గాయాలు

22
0

కారంచేడు (Karamchedu) : హైదరాబాద్ (Hyderabad) నుంచి వాడరేవు (Vadarevu) వెళ్తున్న కారు కారంచేడు బైపాస్ రోడ్డులో టైరు పగలడంతో బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన గురువారం జరిగింది. కారంచేడు ఎస్ఐ ఖాదర్ భాష తెలిపిన వివరాలు ప్రకారం చీరాల మండలం వాడరేవులో బంధువులను చూసేందుకు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఎపి 31 సిహెచ్ 1381 కారులో ముంగర మోహనరాజు, ఆయన సోదరులు సిల్వెస్టర్ రాజు, నిరీక్షణ రాజు బయలుదేరారు.

కారు నూతనంగా నిర్మిస్తున్న హైవేలో కారంచేడు, కుంకలమర్రు రోడ్డు దాటిన తర్వాత కుంకలమర్రు డొంక రోడ్డు సమీపంలో కారు వెనుక టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి ఫల్టీలు కొట్టి ఎడమ రోడ్డులో నుండి కుడి రోడ్డులోకి బోల్తా పడింది. ఈ ఘటనలో ముంగర మనోహరరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అతని సోదరులు ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. గాయపడ్డ ఇద్దరినీ చికిత్స నిమిత్తం చీరాల వైద్యశాలకు పంపినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.