టంగుటూరు : సీఆర్డీఏ రద్దు చేస్తూ మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని ఆశాలతా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, టంగుటూరు సర్పంచ్ వైసీపీ అభ్యర్థిని కురుగుంట్ల స్నేహలత అన్నారు. నాలుగురోడ్ల కూడలిలో స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆశాలత మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవాధ్యక్షురాలు బొడ్డు గ్లోరీ సహకారాలతో నిర్వహించిన కార్యక్రమంలో కురుగుంట్ల ఆశాలత మాట్లాడారు. గవర్నర్ సీఆర్డీఏ రద్దు చేసి మూడు రాజధానుల వికేంద్రీకరణబిల్లుకు ఆమోదముద్ర వేయడం సంతోషకర విషయం అన్నారు. ఒక్కచోటే అభివృద్ధి చెందకుండా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు దిశ వంటి చట్టాలతో భరోసానిచ్చి అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, 45నుండి 60సంవత్సరాలలోపు మహిళలకు ఆర్థిక సహాయం అందజేచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆనందదాయకం అన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి పెరగితే మహిళలు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అమ్మ ఒడి, ఇండ్ల స్థలాల వంటి ఎన్నో పథకాలు మహిళల పేర్లతో ఇవ్వడం వంటివి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, బొడ్డు శ్రీనివాసరావు, దుగ్గిరాల సునీల్, తులిమిల్లి చరణ్, నత్తల క్రాంతి, నత్తల బుజ్జి, గడ్డం ఆనంద్, కురుగుంట్ల జాన్ బాబు, పారి ఆశీర్వాదం, జడా కోటయ్య, కారుమంచి తేజ, తురక కొండలరావు, బుర్రి చంద్ర, జయరావు, ఎల్లమంద, పద్మారావు, శ్రీకాంత్, బంటి, చింటూ, కోటయ్య పాల్గొన్నారు.