వేటపాలెం : చల్లారెడ్డిపాలెం పంచాయతీ జగన్నాధపురంకు చెందిన జీడి బట్టీ కార్మికులు తమకు పని కల్పించి తమను బతికించండని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత 50రోజులుగా లాక్ డౌన్ కారణంగా చేయడానికి పని లేక తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సాయంగాని దాతలు చేస్తున్న సాయంగానీ వారం పది రోజుల కంటే మించి కుటుంబాన్ని పోషించలేక పోతున్నామని చెబుతున్నారు. షరతులతో కూడిన అనుమతులతో పని కల్పించి తమను బతికించాలని కార్మికులు సూళ్లూరి బాబురావు, రాపూరు ఏడుకొండలు, యలమంచిలి పార్వతి, వెంకటేశ్వరమ్మ కోరారు.