Home ఆంధ్రప్రదేశ్ జగన్ కేబినెట్ కీలక నిర్ణయాలు

జగన్ కేబినెట్ కీలక నిర్ణయాలు

404
0

– కాంట్రాక్టర్లకు షాక్
– ఆర్టీసీ విలీనానికి ఆమోదం
– ఇసుక విధానం రెడీ
అమరావతి : ఆర్టీసీ సిబ్బంది ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారు. రివర్స్ టెండర్ల విధానం కొనసాగింపులో కాంట్రాక్టర్లకు షాక్ ఇచ్చింది. రద్దు అయిన టెండర్లలో చెల్లించిన అడ్వాన్సులు వెనక్కి ఇవ్వనున్నారు. ఇలా కేబినెట్లో అనే కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించిన అంశాలు
– ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
– బందర్ పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమి వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
– మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
– ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త విధానం.
– రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానం.
– దీని ప్రకారం టన్నుకి రూ.375 ధరగా నిర్ణయం.
– తొలి దశలో 58 ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.
– ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్.
– దశల వారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల పెంపు.
– వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను క్యూబిక్ మీటర్‌కు రూ. 60చొప్పున కొనుగోలు.
– ఇసుక ఎవరైనా నిలవచేస్తే కఠిన చర్యలు.
– ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేధం.
– ఈ నెల 10 నుంచి ఇసుక బుకింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం.

– పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌లోని రూ. 3,216.11 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల రద్దు.
– రివర్స్ టెండరింగ్ పద్ధతిలో కొత్త టెండర్లు.
– కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సుల రికవరీకి ఆమోదం.
– ఆటోలు, ట్యాక్సీల యజమానులకు ఏడాదికి రూ.10 వేలు పంపిణీ.
– దీని వల్ల 4లక్షల మందికి ప్రయోజనం.
– శ్రీరామ నవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం అమలు.
– వికలాంగులను పెళ్లి చేసుకుంటే రూ.1.50 లక్షలు కానుక.
– భవన నిర్మాణ కార్మికుల పిల్లలను వివాహం చేసుకుంటే రూ.లక్ష.
– ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెళ్లికానుకగా రూ.లక్ష.
– బీసీలకు పెళ్లి కానుకగా రూ.50 వేలు.
– పెళ్లి రోజే వైఎస్సార్ పెళ్లి కానుక నగదు అందజేత.
– రూ.750కోట్లతో వైఎస్సార్ పెళ్లి కానుక నిధి

– కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరంలో డీఆర్‌డీవో రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయింపు.
– బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రాబ్యాంక్‌ పేరును యధాతథంగా ఉంచాలని కేబినెట్ తీర్మానం.
– చిత్తూరు, కడప జిల్లాల్లో మూడు చోట్ల ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు 25ఎకరాల స్థలం కేటాయింపు.
– నడికుడి-శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణం నిమిత్తం ప్రకాశం జిల్లాలో 20ఎకరాలు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపు.
– బలిమెల ఘటనలో మరణించిన ఏపీఎస్‌పీకి చెందిన వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో పది సెంట్ల భూమి కేటాయింపు.
– తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కి పెంపు.