Home క్రైమ్ మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్ : ఒంగోలు డిఎస్పీ ప్రసాద్

మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్ : ఒంగోలు డిఎస్పీ ప్రసాద్

434
0

ఒంగోలు : ఒంగోలు, కొండపి, టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటారు సైకిళ్ళ వరుస చోరీలకు పాల్పడుతున్న పాలపోగు సిద్ధయ్యను అరెస్ట్ చేసి అతని వద్దనుండి రూ.2.15లక్షల విలువ చేసే 6 మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఒంగోలు డిఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపి మండలం కోయవారిపాలెంకు చెందిన పాలెపోగు సిద్ధయ్య గత 6 సంవత్సరాల నుండి చెడు వ్యసనాలకు అలవాటుపడి, డబ్బులు అవసరం అయినప్పుడల్లా పాత తాళంచెవిలను ఉపయోగించేవాడన్నారు.

 

2018లో మర్రిపూడి పోలీసులు సిద్ధయ్యను అరెస్ట్ చేసి 46మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసినట్లు చెప్పారు. 2020లో కొండపి, టంగుటూరు, ఒంగోలులలో మోటారు సైకిళ్ళను దొంగిలించినట్లు తెలిపారు. కొండపిలో వరుసగా మోటారు సైకిళ్ళ చోరీ జరుగుతుండటంతో జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ఉత్తర్వుల మేరకు ఒంగోలు డిఎస్పీ, సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసులు, కొండపి ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తమ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మోటారు వాహనాల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సిద్ధయ్యను అరెస్ట్ చేసిన కొండపి ఎస్ఐ యన్ సి ప్రసాద్, ఏఎస్ఐ పివి హనుమంతరావు, పోలీసులు కె వెంకటేశ్వర్లు, ఉదయకుమార్, రవి, హోంగార్డు శేఖర్, సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసులును జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించినట్లు డిఎస్పీ తెలిపారు.