Home బాపట్ల శనగలు కొనిపించండి సారు : కలెక్టర్ ఎదుట రైతులు ఆవేదన

శనగలు కొనిపించండి సారు : కలెక్టర్ ఎదుట రైతులు ఆవేదన

11
0

అద్దంకి (Addanki) : శనగలు క్వింటా రూ.10వేల నుండి రూ.5,300కు ధర పడిపోయి, శనగలు కొనే వారెవరూ రావడం లేదని మండలంలోని చందలూరుకు చెందిన రైతు కలెక్టర్‌ వి వినోద్‌కుమార్‌ (Dr.V.Vinod Kumar IAS) ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న శనగలకు అద్దెలు పెరిగిపోతున్నాయని చెప్పారు. అప్పుల వాళ్ళు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జె పంగులూరు (J Panguluru) మండలంలోని చందలూరు రామాలయం దగ్గర ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలు వర్క్ షాపుకు కలెక్టర్‌ హాజరైన సందర్భంగా ఆయన ఎదుట శనగ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని, రైతులు నష్టపోవడం తప్ప గిట్టుబాటు ధరలు లేవని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు కలెక్షర్‌ దృష్టికి తెచ్చారు. విదేశాల నుండి శనగలు, మొక్కజొన్నలు ప్రభుత్వం దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలని కోరారు. ఈ ఏడాది అన్నదాత సుఖీబవ డబ్బు జమ కాలేదని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం శనగలు కొన్న సందర్భాలు ఉన్నాయా, కొన్ని అవకాశం ఉందాని రైతులను అడిగారు. పంటల భీమా వేరు, పంట నష్ట పరిహారాలు వేరు, రైతులే నేరుగా తమ పంటలకు భీమా చేసుకోవాలని తెలిపారు. త్వరలో భీమా కంపెనీల సమావేశపరిచి విషయం తెలుసుకుని రైతులకు తెలియజేస్తానని చెప్పారు. భూసార పరీక్షలకు రైతులు రైతు సేవా కేంద్రాల దగ్గరకు వెళ్లి మట్టి నమూనాలు ఇస్తే, వాళ్లు మట్టి పరీక్షలు చేయిస్తారని చెప్పారు. ఇప్పటివరకు గ్రామంలో ఎన్ని మట్టి పరీక్షలు చేయించారని అధికారులను ప్రశ్నించారు. 150 మట్టి పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు నరేంద్ర, డివి సుబ్బారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలు వివరించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు శ్రీనివాసులు, బిందు మాధవి రైతులకు తెలిపారు. రైతు వెంకట రామారావు అడిగిన ప్రశ్నలకు మార్టూరు ఎడిఎ సుదర్శన్ రాజు, ఎఒ డి సుబ్బారెడ్డి సమాధానం చెప్పారు.

చందలూరులో భూగర్భ జలాలు పెరిగేందుకు ఊర వాగు, నడివాగులపై చెక్ డ్యాములు నిర్మించాలని మాజీ జడ్పిటిసి కర్రీ వెంకట సుబ్బారావు కోరారు. మాస్టర్ ట్రైనర్లు శిరీష, అశోక్లు పకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ చూసి అభినందించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె స్వరూప రాణి, తహశీల్దారు పీ సింగారావు, ఈఓఆర్డీలు సుమంత్, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఒ అనంతరాజు, దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాసరావు, వాసు, ఎంఇఒ వీరాంజనేయులు, ఎపిఒ సంతోషం, చందలూరు సర్పంచి పెంట్యాల కృష్ణారావు, పంచాయతీ సెక్రెటరీ కళ్యాణి, ఎంపీటీసీ వాసవి శేషరావు, హార్టికల్చర్ అధికారి దీప్తి, హౌసింగ్ ఎఇ కిషోర్ కుమార్ పాల్గొన్నారు.