చీరాల : నీళ్లే ఆధారం. ప్రాణం నిలుపుకునేందుకు, ఆరోగ్యం కాపాడుకునేందుకు తాగే నీళ్లు శుద్ది చేసినవై ఉండాలని అందరికీ తెలిసిందే. అందుకే ఉచితంగా దొరికే నీళ్లను కూడా కొనుగోలు చేసి మరీ తాగేందుకు వాడుకుంటున్నాం. శుద్ది చేసిన నీటిని తాగాలన్న ప్రజల చైతన్యం నీటి వ్యాపారులకు వరంగా మారింది. శుద్ద జలమంటే క్యానులో నింపిన నీళ్లన్న అభిప్రాయం ఉంది. అందుకే ఏవైతేనేం నీటిని క్యానుల్లో నింపి క్యాను రూ.5నుండి రూ.20వరకు అమ్ముతున్నారు. ఆ నీళ్ల క్యానులు ఇప్పడు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. పాచిపట్టి, పురుగులతో నిండి ఉన్నాయి. కనీసం క్యానులను కూడా కగడకుండా నీటిని సరఫరా చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి నీటి వ్యాపార కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం క్యానుపై కనీసం కంపెనీ పేరుకూడా ప్రచురించకపోవడం గమనార్హం.