Home ప్రకాశం చీరాల బంద్… నేతల అరెస్ట్

చీరాల బంద్… నేతల అరెస్ట్

537
0

చీరాల : వికేకరి నాగార్జునరెడ్డిపై జరిగిన హత్యా యత్నానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ప్రజాసంఘాల నేతలు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చీరాల బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దనుండి ర్యాలీ గా బయలుదేరారు. గురువారం రాత్రి నుంచే పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు చేయొద్దంటూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఉంచారు.

పోలీసుల తీరుపై ప్రజాసంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున రెడ్డిపై హత్యా యత్నానికి పోలీసులదే బాధ్యతని, పోలీస్ వైఫల్యం వల్లనే అతడిపై పదేపదే దాడులు జరుగుతున్నాయని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

శాంతియుతంగా బంద్ చేస్తుంటే, ప్రజలు కూడా సహకరిస్తుంటే పోలీసులు మాత్రం తమను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్న నేతలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎమ్ వసంత రావు, సిపిఐ కార్యదర్శి ఎమ్ వెంకటరావు, శామ్యూల్, అచ్యుతుని బాబురావు, ప్రజా సంఘాల నేతలు దామర్ల శ్రీకృష్ణ, మాచర్ల మోహనరావు, మోహన్ కుమార్ ధర్మ, దుడ్డు శ్యాంసుందర్ ఉన్నారు. ఇక మరోవైపు పట్టణంలో బంద్ స్వచ్ఛందంగా సాగుతోంది.