Home ప్రకాశం బుచ్చిరాజుపాలెంలో డాక్ట‌ర్ మాదాసి వెంక‌య్య రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మం

బుచ్చిరాజుపాలెంలో డాక్ట‌ర్ మాదాసి వెంక‌య్య రావాలి జ‌గ‌న్ కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మం

594
0

టంగుటూరు : బుచ్చిరాజుపాలెంలో శుక్రవారం రాత్రి ” రావాలి జగన్ కావాలి జగన్” కార్యక్రమాన్ని వైసిపి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్ట‌ర్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కాలనీలో ప్రతి గడప గడపకు తిరిగి వైసిపి నవరత్న ప‌థ‌కాల‌ను వివరించారు. పేదలకు మేలు జ‌ర‌గాలంటే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు అమ‌లు కావాల‌న్నారు. కాలనీలో సమస్యలను కాల‌నీవాసులు డాక్ట‌ర్‌ వెంకయ్య దృష్టికి తెచ్చారు. రోడ్లు, వీధి దీపాలు లేవ‌ని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలిపారు. అంత‌ర్గ‌త డ్రైన్లు నిర్మిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఎలాంటి ప‌నులు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతర్గ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు చేపడుతామని వెంక‌య్య చెప్పారు. జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాల‌న్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బోట్ల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి సూదనగుంట శ్రీహరిరావు, వైసిపి మండల అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, మాజీ టుబాకో మెంబర్ సూరం రమణారెడ్డి, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ బొడ్డపాటి అరుణమ్మ, దర్మంద్ర, నత్తలక్రాంతి కుమార్, దండేల వినోద్, కొమ్ము ప్రభుదాస్, వంకాయల రోశిబాబు, బిల్లా బాలకోటయ్య, సుధాకర్, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు.