టంగుటూరు : సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులకు అల్పాహారం అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా ‘లాక్ డౌన్’ కాలంలో కూడా అందరూ ఇండ్లలో ఉంటే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయడం అభినందనీయమని సిఐటియు నాయకులు అన్నారు. వీరితోపాటు వైద్యులు, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లు, గ్రామ సచివాలయ వాలంటరీ సిబ్బంది, జర్నలిస్టులు చేస్తున్న సేవలను అభినందించారు. వీరందరికీ ప్రజలందరూ సహకరించాలని కోరారు. 6 నెలల నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాము, వి మోజస్, వై సురేష్ బాబు, బెన్ను, బాలకోటయ్య, యూటీఫ్ నాయకులు పి వెంకటరావు, పంచాయతీ సెక్రటరీ జగదీశ్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.