Home TV News Brahmamudi Serial Today April 23rd Episode: రుద్రాణి.. అప్పుడే చెప్పం కదా! నీకు అంత...

Brahmamudi Serial Today April 23rd Episode: రుద్రాణి.. అప్పుడే చెప్పం కదా! నీకు అంత సీన్ లేదని.. ఓ ఎగేసుకొని పోయావ్.. ఇప్పుడు చూడు!

87
0

Brahmamudi Serial Today April 23rd Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఏప్రిల్ 23వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రాహుల్ మమ్మీ మనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కంపెనీ గురించి, రు.2 కోట్ల అప్పు గురించి చెబుతాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పావు ఇక నేను చూసుకుంటానని నవ్య జ్యువెలర్స్ ఓనర్ కి ఫోన్ చేసి మీరు రు.4కోట్ల డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి మీకు రెండు వారాలు టైం దొరుకుతుందని సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తేనే డబ్బులు కడతామని పిటిషన్ పెట్టండని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

అంతటితో ఆగకుండా మందర రుద్రాణి రు.2కోట్ల అప్పు ఉన్న వారికి కాల్ చేసి మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది రాజు లేకపోవడంతో అమౌంట్ మొత్తం డిలీట్ అయిపోయింది ఎలా అయినా చేసి మీరు కావ్యతో డబ్బులు లాగండని చెప్పడంతో వాళ్ళు సరే అని అంటారు. అలా ప్లాన్ సక్సెస్ కాబోతున్నందుకు తల్లి, కొడుకు ఇద్దరూ తెగ సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు కావ్య రాజ్ ఇద్దరూ కూడా ఏజెంట్ పోలీస్ ఆఫీసర్ డ్రామా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. (Photo Credit: Brahmamudi serial star maa/Disney +Hotstar

తర్వాత నేను కూడా మీకు గిఫ్ట్ పంపాలని ఫిక్స్ అయిపోయాను. మీ ఇంటి అడ్రస్ చెప్పండి అనడంతో కావ్య తప్పకుండా చెప్పాల్సిందేనా అనగా చెప్పాల్సిందే అని పట్టుబడతాడు రాజ్. మీరు అడ్రస్ చెప్పకపోతే నేను మిమ్మల్ని మేడం అని పిలుస్తాను అనడం చెప్పడంతో ఆపండి వద్దు అని చెప్పి ఇంటి అడ్రస్ చెబుతుంది కావ్య. ఒక పొడుపు కథ చెప్పి ఆ పొడుపు కథ విప్పితే మా ఇంట్లో అడ్రస్ కరెక్ట్ గా తెలుస్తుందని చెబుతుంది కావ్య.

అడ్రస్ తెలియకపోయినా కావ్య ముందు తెలిసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు రాజ్. కావ్య చెప్పిన పొడుపు కథ చూస్తూ ఒక్క ముక్క అర్థం కావడం లేదు నాకు ఏంటి శిక్ష అనుకుంటూ ఉంటాడు. తర్వాత నవ్య జువెలరీ అతను ఫోన్ చేసి రాజ్ గారి డెత్ సర్టిఫికెట్ ఉంటే లేదంటే మీరు ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుంటేనే మేము బిల్ పే చేస్తామని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.

ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఆఫీస్ కి బయలుదేరుతుంది కావ్య. కాఫీ తాగు అనగా నాకు అంత టైం లేదని బయలుదేరుతుండగా ఇంతలోనే అక్కడికి కొందరు ఆఫీసర్స్ వస్తారు. మీరేంటి ఇంటి దగ్గరికి వచ్చారు. ఆఫీస్ లో మాట్లాడుకుందామని చెప్పాను కదా అనగా మా మేనేజర్ అంత టైం ఇవ్వలేదని అంటారు. రాజ్ సార్ ఉన్నప్పుడు టయానికి మాకు బిల్లులు పడేవి కానీ ఇప్పుడు పడడం లేదని చెబుతారు.

ఇప్పుడు తప్పనిసరిగా బిల్లులు పే చేయాల్సిందే అనడంతో మా మీద నమ్మకం లేదా అని అంటారు సుభాష్ ప్రకాశం. అదేంటమ్మా డబ్బులు ఎందుకు పే చేయలేదు. ఎందుకు డిలే చేశావని ఇంట్లో అందరూ అడుగుతుండగా కావ్య మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది. అకౌంట్లో డబ్బులు లేవు. రాజ్ లేడు కాబట్టి పవర్ ఆఫ్ అటోని కావ్య చేతిలో లేదు కాబట్టి ఆ బిల్స్ క్లియర్ చేసే హక్కు కావ్యకు లేదని అంటుంది.

దీనికి ఒకటే మార్గం ఉంది డెత్ సర్టిఫికెట్ చేయాల్సిందే అనడంతో అందరూ షాక్ అవుతారు. రాజ్ బతికే ఉన్నాడు. సంతకం పెట్టాల్సిన అవసరం లేదు అనడంతో వెంటనే రాజ్ రమ్మని చెప్పండి వదిన అని ఇరకాటంలో పడేస్తుంది రుద్రాణి. అప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా కచ్చితంగా రాజ్ రావాల్సిందే సంతకం పెట్టాల్సిందే లేకపోతే డెత్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టండి అని అంటుంది రుద్రాణి.