Home TV News Brahmamudi Serial Today April 19th Episode: అయిపొయింది యామిని.. నీ కథ కంచికి వచ్చేసింది.....

Brahmamudi Serial Today April 19th Episode: అయిపొయింది యామిని.. నీ కథ కంచికి వచ్చేసింది.. పొట్టి పోలీస్ కూపీ అంత లాగుతోందిగా!

124
0

Brahmamudi Serial Today April 19th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఏప్రిల్ 19వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ లో రాజ్, అపర్ణను కేక్ కట్ చేయించడానికి తీసుకొని వెళ్తాడు. ఇంతలోనే యామిని అక్కడికి వస్తుంది. తర్వాత రాజ్ కేక్ కట్ చేయించి అపర్ణకు తినిపిస్తాడు. అది చూసిన యామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అపర్ణ కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం చూసి సంతోషపడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన యామినిని చూసి రాజ్ షాక్ అవుతాడు. అప్పుడు బావ నువ్వెంటి ఇక్కడ అని అడగడటంతో అది పక్కన పెట్టు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్. నేను ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలుసు.

చెప్పు యామిని ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని కోపంగా అడగటంతో యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య నేనే పిలిచాను నేనే రమ్మని చెప్పాను అని యామిని ని సేవ్ చేస్తుంది. ఎందుకు అనడంతో మీరు ఇందాక భోజనం వడ్డిస్తున్నప్పుడు కాల్ చేయగా నేను లిఫ్ట్ చేసి మీరు పనిలో ఉన్నారని చెప్పాను అంటూ అబద్ధాలు చెబుతుంది కావ్య. అయినా ఈవిడ ఎవరు అనగా అమ్మ అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది యామిని. (Photo Credit: Brahmamudi serial star maa/Disney +Hotstar)

ఏంటి అనగా అమ్మ లాంటిది అనే కవర్ చేస్తాడు రాజ్. అప్పుడు రాజ్ మాటలకు సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు కూడా కేక్ తినిపించు అనడంతో కావాలనే కేక్ చీర మీద పడేలా చేస్తుంది యామిని. ఏంటి యామిని ఇలా చేసావు అమ్మ వెళ్దాం రండి క్లీన్ చేసుకుందురు అని రాజ్ అపర్ణ ని పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు కావ్య ఏంటి యామిని గారు ఇక్కడికి కూడా వచ్చేసారు. ఇందాక నేను మిమ్మల్ని సేవ్ చేయకపోయి ఉంటే ఏం జరిగేదో మీకు తెలుసు కదా అని అంటుంది. (Photo Credit: Brahmamudi serial star maa/Disney)

అప్పుడు కావ్య మాటలకు ఆశ్చర్యపోతుంది యామిని. అయినా తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం పక్షి నుంచి గూడును వేరు చేయడం మహా పాపము కదా అని ఇండైరెక్టుగా మాట్లాడడంతో అవును అని టెన్షన్ పడుతూ మాట్లాడుతుంది యామిని. మన అనుకున్న వాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్తాను అని యామిని అంటుంది. తర్వాత అపర్ణ చీర క్లీన్ చేసుకొని వస్తుంది. అప్పుడు రాజ్ వెళ్ళొస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్లి నన్ను దీవించండి అమ్మ అని దీవెనలు తీసుకుంటాడు.

అప్పుడు కావాలనే యామిని రాజ్ తో కలిపి మళ్ళీ అపర్ణ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంది. త్వరలోనే మీరు కూడా నా పెళ్ళికి రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ చేసినందుకు అపర్ణ సంతోష పడుతూ ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఆ యామిని ఎవరూ పెళ్లి అంటుంది ఆ విషయాలు ఏమీ మీరు పట్టించుకోకండి సంతోషంగా ఉండండి అని అంటుంది

పెళ్లి జరగదు అనడంతో ఏంటి నీ ధైర్యం అనగా మీరే నా ధైర్యం అని ఉంటుంది కావ్య. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది కాదు ఆయన మనకు దొరికరు. అదే మనకు చాలు. ఏమి కాదు సంతోషంగా ఉండండి అని అపర్ణకు దైర్యం చెబుతుంది కావ్య. తర్వాత రాజ్ ఇంటికి వెళ్లగా ఏమి జరగనట్టు సంతోషంగా పలకరిస్తూ ఉంటారు. మీ అమ్మ నాన్న పుట్టినరోజు అని నీకు ఎలా తెలుసు బాబు అనడంతో సమాధుల మీద చూశాను అని అంటారు రాజ్. ఈరోజు అపర్ణ గారి పుట్టినరోజు అందుకే ఆవిడతో కలిసి సెలబ్రేషన్ చేశాను అని అంటాడు రాజ్.

రాజ్ మాటలకు వైదిహి యామిని ఇద్దరూ షాక్ అవుతారు. గుడిలో జరిగిన దానికి చాలా సంతోషపడుతూ ఉంటాడు రాజ్. నీ ముఖంలో చాలా రోజుల తర్వాత సంతోషం చూస్తున్నాను ప్రతిరోజు ఇలాగే మీరు ఉండాలి అని అంటుంది. ఇంతకీ ఎవరు ఈ అపర్ణ అని వైదేహి అడగడంతో రాజ్ కన్నతల్లి అనగా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు