Home బాపట్ల విద్యార్థులుకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులుకు పుస్తకాలు పంపిణీ

158
0

చీరాల : మండలంలోని ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ట కాలువ వద్ద నివసిస్తున్న పేద విద్యార్థులకు డాక్టర్ బాబు జగజ్జీవనరావు చైర్ పరిశోదకులు తేళ్ళ రాంబాబు ఆధ్వర్యంలో వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసన సభ్యులు కరణం బాలరామకృష్ణమూర్తి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన తనయుడు కరణం వెంకటేష్ బాబు పేదల పక్షంగా ఉంటారని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయ, సహకారం అందిస్తూ అండగా ఉండే వ్యక్తి అన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన 40ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో ఎంతో మందికి ఉద్యోగాలు, వ్యవసాయ రంగంలో సహాయం అందించిన వ్యక్తి బలరామ కృష్ణమూర్తి ఆదర్శంగా తనయుడు వెంకటేష్ బాబు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.