Home ప్రకాశం చిన్నతనం నుండి క్రమశిక్షణ అలవర్చుకోవాలి : తాడివలస దేవరాజు

చిన్నతనం నుండి క్రమశిక్షణ అలవర్చుకోవాలి : తాడివలస దేవరాజు

374
0

చీరాల : సెట్ మార్క్స్ చర్చ్ నందు సండే స్కూల్ పిల్లలకి రమేష్ డయాగ్నోస్టిక్ సహకారంతో పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు చర్చి సూపర్డెంట్ యాతం క్రాంతి అధ్యక్షత వహించారు. సభలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు చేతుల మీదుగా సండే స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది,

తాడివలస దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు సమయం వృధా చేయకుండా ఇష్టంగా చదువు కోవాలని ఆశీర్వదించారు. చదువుతో పాటు, దైవసేవలో కూడా ముందుండాలని అన్నారు. అందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో రమేష్, యాతం క్రాంతి, భాగ్య రాణి, విజయ సారథి, అరుణ కుమారి, వినోద్, సండే స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.