Home ఆంధ్రప్రదేశ్ నటుడు విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

నటుడు విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

363
0

నటుడు విజయ్‌ నివాసాన్ని బాంబులతో పేల్చనున్నట్లు బెదిరింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు గత 26వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి విజయ్‌ ఇంటిని బాంబులతో పేల్చనున్నట్లు తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు సాలిగ్రామంలో విజయ్‌ తండ్రి నివాసానికి, నీలాంగరైలోని విజయ్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో టెలిఫోన్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అన్నానగర్‌కు చెందిన ఓ యువకుడు సెల్‌ఫోన్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఆ యువకుడ్ని అరెస్టుచేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.