Home ప్రకాశం బొడ్డు నరసింహం 10వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్యశిభిరం

బొడ్డు నరసింహం 10వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్యశిభిరం

580
0

టంగుటూరు : బొడ్డు నరసింహం 10వ వర్ధంతి సందర్భంగా పురం సెంటర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ సపోర్ట్ కార్యక్రమం జరిగింది. స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ, ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు. ఎన్నో ఉద్యోగ నియామకాలు చేపట్టారని, ఇది పేదల ప్రభుత్వం అన్నారు. అలాగే ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామీణ ప్రాంత పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఉన్నోడికి పెట్టడం కాదు లెనోడికి పెట్టాలనే మంచి సహృదయంతో ఇంతటి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నిర్వాహకులైన ఆదాయ పన్ను శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వర్లును అభినందించారు.

కార్యక్రమంలో కిమ్స్ హాస్పటల్ నుంచి వివిధ విభాగాలకు చెందిన తొమ్మిది మంది డాక్టర్లు పాల్గొని ఉచిత పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగింది. ఈ వైద్య శిబిరంకు వచ్చిన వారికి ఉచిత భోజన సదుపాయం, పండ్లు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో మండలంలోని చుట్టు ప్రక్క గ్రామాలకు చెందిన 1500 మంది రోగులు వైద్య సేవలు అందుకున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సెల్వన్ రాజు, పారిశ్రామిక వేత్త చిడిపోతు వెంకటేశ్వర్లు, డేవిడ్, పాతూరి శ్రీను, నెప్పల సుబ్బారావు, జలదంకి హరి, రావూరి వెంకట సుబ్బయ్య, కరవది అనిల్, బొడ్డపాటి అరుణ, చల్లపల్లి గోపాల్, జె కోటేశ్వరరావు, వినోద్, క్రాంతి, ధర్మేంద్ర పాల్గొన్నారు.