Home ప్రకాశం ఆరోగ్యవంతమైన సమాజం – రోటరీ క్లబ్ యొక్క లక్ష్యం

ఆరోగ్యవంతమైన సమాజం – రోటరీ క్లబ్ యొక్క లక్ష్యం

335
0

చీరాల : ప్రతి ఒక్కరు రక్తం గ్రూపుని తెలుసుకొనుట ఎంతో అవసరమని డాక్టర్ పలుకూరి సురేష్ అన్నారు. యద్దనపూడి మండలం పూనూరు జడ్పీ హైస్కూల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి చీరాల సహకారంతో ఉచిత బ్లడ్ గ్రూప్ ఇన్ పరీక్ష, చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరు సురేష్ చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూప్ తెలుసుకొని ఉండాలని అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగకరమని ఎంఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ ఇన్ పరీక్షలు చేశారు.

డాక్టర్ పలుకురి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చేతులు చెవి, ముక్కు, గొంతు భాగాలలో పెట్టుకోకూడదన్నారు. సంవత్సరానికి ఒకసారి చెవులను చెకింగ్ చేయించుకోవాలని తెలిపారు. అవసరమైనవారికి ఉచితంగా చెవి, గొంతు ఆపరేషన్లు చేయబడునని తెలియజేశారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ టి శారద దేవి, ఉపాధ్యాయలు ఎం గోవింద రాజు, ఎస్ లలిత పరమేశ్వరి, ఎం రాఘవరెడ్డి, ఎం నాగిరెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు, టి పద్మ, యూ తిరుపతయ్య, ఆర్ శ్రీనివాసరావు, వై పద్మజ, సిహెచ్ చెంచుబాబు, బి రమాదేవి పాల్గొన్నారు.