సింగరాయకొండ : మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్ సహకారంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కరోనా వైరస్ తో ఎంతో మంది రోగులకు రక్తనిల్వలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పార్టీలకు అతీతంగా తమ మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ ద్వారా సింగరాయకొండలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో మాగుంట వీరరాఘవరెడ్డి ట్రస్ట్ కొండపి నియోజకవర్గ కోఆర్డినేటర్ పి సాగర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుల్ తో పాటు 52మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సింగరాయకొండ ఎస్ఐ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు సలీం భాషా, జిలాని, కిషోర్, హుస్సేన్, సతీష్, నజీర్ పాల్గొన్నారు.