కొండపి : మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒంగోలు రిమ్స్ సారధ్యంలో వైస్సార్ సీపీ కొండపి జడ్పీటీసీ అభ్యర్థిని మారెడ్డి అరుణ కుమారి, మారెడ్డి వెంకటాద్రిరెడ్డి పొదిలి రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన రక్తదాన శిబిరం జరిగింది.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి జడ్పీటీసీ అభ్యర్థిని మారెడ్డి అరుణ కుమారి పండ్లు, కూల్ డ్రింక్స్ అందజేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన వారికి ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. కరోనా లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇండ్లకే పరిమితమైనందున కరోనా వైరస్ పాజిటివ్ రోగులు, ఇతర అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన రోగులకు రక్త నిల్వలు సరిపోయినంత లేనందున ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాలల్లో రోగుల అత్యవసరాలను గ్రహించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి మానవత్వంతో తమ మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని మరిన్ని మండలాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎక్కువ రక్తనిల్వలు సేకరించి రాష్ట్ర వైద్యశాఖకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వైసీపీ నాయకులు, బిల్డర్ మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, జర్నలిస్టులతో పాటు 40మంది మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ కొండపి నియోజకవర్గ కోఆర్డినేటర్ పి సాగర్ రెడ్డి, వైసీపీ నాయకులు డాకా పిచ్చిరెడ్డి, గోగినేని వెంకటేశ్వర్లు, ఉపేంద్ర, చవటపాలెం రమేష్, భువనగిరి సత్యం పంతులు, బచ్చల కోటేశ్వరరావు, పర్చూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.