బండి సంజయ్ అక్రమ అరెస్ట్‌పై ఆగ్రహం.. జూబ్లీహిల్స్‌లో భారీ ధర్నా

    348
    0

    హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేయడంపై జూబ్లీహిల్స్ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు వెల్దండ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఫిల్మ్‌నగర్ సీవీఆర్ న్యూస్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి భౌతిక దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెల్డండ వెంకటేశ్ మాట్లాడుతూ బీజేపీ నేతలు, కార్యకర్తలపై కావాలనే కేసులు పెడుతున్నారన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    ధర్నా కార్యక్రమంలో బీజేపీ జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు వల్లెపు శంకర్‌తో పాటు గణేష్, కుబేరు, రామాంజనేయులు, వీరవేని శశి, శేఖర్, సురేష్, మహిపాల్ రెడ్డి, డి.రమేష్, దండుగుల శేఖర్, అంజి, యాదగిరి, అనిల్ కుమార్, కరుణాకర్, మహేష్, రవి, అహ్మద్, శివ, అనిల్, తదితరులు పాల్గొన్నారు.