Home ప్రకాశం విద్యుత్ ఛార్జీల పెంపుపై బిజెపి, జనసేన నిరసన

విద్యుత్ ఛార్జీల పెంపుపై బిజెపి, జనసేన నిరసన

303
0

చీరాల : జనసేన, బిజెపి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలను సవరించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నెల పూర్తి విద్యుత్ చార్జీలను మాఫీ చేయాలని చీరాల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భముగా నాయకులు మాట్లాడుతూ ప్రజలు అందరు ఒక విపత్కర పరిస్థితుల్లో తినడానికి సరిగా లేని పరిస్థితిలో విద్యుత్ చార్జీలను అధికముగా వసూలు చేయడం సమంజసం కాదన్నారు. వైసిపి ఏదాడి పాలనలో ఏమి వెలగబెట్టారని ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.

కార్యక్రమంలో బిజెపి నియోకవర్గ ఇంచార్జీ మువ్వల వెంకట రమణారావు, బిజెపి పట్టణ అధ్యక్షులు అరవపల్లి కుమార్, బిజెపి మీడియా ఇంచార్జీ చంద్ర, జనసేన నియోజకవర్గ నాయకులు గూడూరు శివ రామప్రసాద్, తోట రాజశేఖర్, ఉగ్గీరాల మర్ఖండేయులు, అనుమకొండ కిషోర్ పాల్గొన్నారు.