చీరాల : చేనేతలు, బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న బిసి కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య మరిన్ని పదవులు అధిరోహించాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత, చీరాల జిల్లా సాధన చైర్మన్ తాడివలస దేవరాజు కోరారు. అవ్వారు ముసలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అవ్వారు ముసలయ్య పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించాడానికి కుటుంబ సమేతంగా కృషి చేస్తున్నరని అన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు బీసీల హక్కులకోసం జరిపిన పోరాటంలో, అధికారంలోకి వచ్చిన తరువాత చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో ముసలయ్య పాత్ర ఉందన్నారు. చీరాల జిల్లా సాధన కోసం ఆయన సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, మురళి, నరేంద్ర పాల్గొన్నారు.