Home ప్రకాశం ఘనంగా వరికూటి అశోక్ బాబు పుట్టినరోజు వేడుకలు

ఘనంగా వరికూటి అశోక్ బాబు పుట్టినరోజు వేడుకలు

351
0

కొండపి (దమ్ము) : వైఎస్ఆర్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు జన్మదిన వేడుకలు టంగుటూరు బస్టాండ్ సెంటర్ లోని బొమ్మల సెంటర్ లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అలాగే కొండపి నియోజకవర్గంలోని కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలలో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగులు, సేవాకార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు.

అశోక్ బాబు అభిమానులు టంగుటూరులోని అశోక్ బాబు ఇంటికి చేరుకుని అర్ధరాత్రి 12గంటలకు అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ ని అశోక్ బాబు కట్ చేశారు. అశోక్ బాబు స్థానిక పోలేరమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అశోక్ బాబు ఉదయమే చీరాలలో నివాసం ఉంటున్న సోదరుడు డాక్టర్ అమృతపాణి స్వగృహానికి వెళ్లి తల్లికి పాదాభివందనం చేసి, ఆమె దీవెనలు తీసుకున్నారు. అనంతరం అమరావతిలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన వర్క్ షాప్ పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు.

టంగుటూరులో వైసీపీ నాయకులు చింతపల్లి హరిబాబు, బీనీడి ఉదయకుమార్, ఉప్పలపాటి సుబ్బరాజు, పుట్టా వెంకట్రావు, తుల్లిబిల్లి అశోక్, బాలకృష్ణారెడ్డి, దాసు, వెంకటస్వామి, పేర్రాజు, సీతారామయ్య, కొండపిలో సీనియర్ నాయకులు గొట్టిపాటి మురళి, ఆరికట్ల కోటిలింగయ్య, ఆరికట్ల హరినారాయణ, పోకూరి కోటయ్య, రాజీవ్ చౌదరి, కట్టా రవణయ్య, చిన్నబ్బి, పోలీస్ కోటయ్య, పెంచిలియా, పరిటాల శేషయ్య తదితరులు పాల్గొన్నారు.