Home సినిమా బిగ్‌బీని మళ్లీ ఆరోగ్యంగా చూడాలి: పవన్

బిగ్‌బీని మళ్లీ ఆరోగ్యంగా చూడాలి: పవన్

257
0

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బీకి పాజిటివ్ రావడంపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అమితాబ్‌ బచ్చన్ త్వరగా కోలుకోవాలన్నారు. బిగ్‌బీని మళ్లీ ఆరోగ్య వంతుడిగా చూడాలని ధన్వంతరీ మాతను వేడుకున్నట్లు పవన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘నా ప్రియమైన, గౌరవనీయలైన అమితాబ్ బచ్చన్‌కి,

నా తల్లి, తండ్రితో సహా కుటుంబం మొత్తం మీ శ్రేయస్సుకు ప్రార్థించిన నాటి సమయం నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు ‘కూలీ షూట్’లో గాయపడినప్పుడు మేమందరం మీ క్షేమాన్ని కోరుకున్నాం. ఒక్క మీ ప్రతిభనే కాకుండా మీ పోరాట స్ఫూర్తి, సరళత, వినయాన్ని సైతం మేము ఇష్టపడతాం. మీకు, అభిషేక్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి చాలా బాధ కలిగింది. ధన్వంత్రి మాత మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శక్తిమంతుల్ని చేయాలని, మళ్లీ మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో చూడాలని ఎదురుచూస్తున్నాం’’ అని పవన్ ట్వీట్ చేశారు.