చీరాల : నవంబర్ 5 నుంచి 8వరకు 5వ ఇండియా-అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్-2019 నిర్వహించారు. ఫెస్టివల్‌లో చీరాల కొత్తపేట జెడ్‌పి హైస్కూల్‌కు చెందిన సైన్స్ ఉపాధ్యాయులు పవని భాను చంద్ర మూర్తి పాల్గొన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విజ్ఞాన ప్రసార్ వారి ప్రశంస పత్రం పొందారు. విజ్ఞాన్ ప్రసార్, న్యూ ఢిల్లీ రిజిస్ట్రార్ అరవింద్, సి రనడే చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
పరిశోధన, ఆవిష్కరణలతో శాస్త్ర సాంకేతికరంగాన్ని బలోపేతం చేయాలనే నినాదంతో ప్రతీ ఏటా ఫెస్టివల్ నిర్వహిస్తారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ విద్యార్థుల్లో సైన్‌స పట్ల అభిరుచిని పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)కు ఎంపిక చేస్తుంది. సైన్స్‌తో ప్రజలను మమేకం చేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం మానవ జీవితాలను మెరుగుపరచడానికి ఏ విధంగా పరిష్కారం అందిస్తాయో చెప్పడమే ఐఐఎస్‌ఎఫ్ ఈవెంట్ ప్రధాన లక్ష్యమన్నారు.
విద్యార్థులు శాస్త్రీయరంగాలను అధ్యయనం చేసి పనిచేసే దిశగా ప్రోత్సహించడమే సంస్థ దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈవెంట్ నిర్వహిస్తూ వివిధ అంశాల్లో ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం 2019లో సైన్సు ప్రాముఖ్యతపై చర్చలో పాల్గొని అనేక సూచనలు చేశారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ని కూడా కలిసినట్లు భానుచంద్రమూర్తి తెలిపారు. మన రాష్ట్రం నుండి 5 మంది ఉపాధ్యాయులో ఒకరిగా హాజరయినట్లు భాను తెలిపారు. తన ఎంపిక పట్ల జిల్లా విద్యా శాఖ అధికారి వీఎస్ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు ఇందిరా ఇజ్రాయిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.