విజయవాడ : ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యలపై డిక్కీ రాష్ట్ర ప్రతినిధి వి భక్తవత్సలం ఏపీ ఎస్ ఎస్ సి జనరల్ మేనేజర్ ప్రభాకర్ గౌడ్, ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ విద్యాసాగర్, ఏజీఎం ఏవి సుబ్బారావు లతో చర్చించారు. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల లీజ్ రిజిస్ట్రేషన్, రాయితీలు, ఇతర సమస్యలపై చర్చించారు. అధికారులు ముగ్గురు సానుకూలంగా స్పందించి ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసక్తి కలిగిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న పథకాలను వర్తింపజేయడంలో చర్యలు తీసుకుంటామన్నారు