ఒంగోలు : ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ ఓనర్ల సబ్సిడీ మంజూరు సమస్యపై చీరాల శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతినిధి వి భక్తవత్సలం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ లబ్ధిదారుల సబ్సిడీ మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ట్రాక్టర్ లబ్ధిదారుల సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని బలరామ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు.