Home ప్రకాశం వెలుగు ఆధ్వర్యంలో లబ్దిదారుల సమావేశం

వెలుగు ఆధ్వర్యంలో లబ్దిదారుల సమావేశం

397
0

టంగుటూరు : 6వ విడత జన్మభూమి సందర్భంగా వెలుగు సంఘాల అద్వర్యంలో సమావేశం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. సమావేశంలో మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాట్లాడారు. వెలుగు పదకాలైన చంద్రన్న భీమా, మహిళా సాధికారత, సంక్షేమం, చంద్రన్న పెండ్లికానుక తదితర కార్యక్రమాల గురించి సభ్యులుకు వివరించారు. రానున్న రోజుల్లో చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేసే భాద్యత తీసుకోవాలని కోరారు. గతంలో పసుపు కుంకుమ పధకం అందని 25 మంది లబ్ధిదారులకు రూ.2.50లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎపిఎం రాజారావు, ఎంపిటిసి భారతి, కార్యదర్శి హరిబాబు, సిసి వెంకట్రావు పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.